కొత్తగూడెం, సింగరేణి (నమస్తే తెలంగాణ) కొత్తగూడెం, సింగరేణి ప్రాంతం గర్వించేలా చేశాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థి కంచర్ల ప్రణవ్. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అతడు రెండు బంగారు పతకాలు, ఒక వెండి సిల్వర్ పతకం సాధించాడు. ప్రణవ్ తండ్రి కంచర్ల శ్రీనివాస్ రావు భద్రాచలం ఆలయ నిర్మాత కంచర్ల గోపన్న భక్త రామదాసు వంశానికి చెందిన 10వ తరానికి చెందిన వ్యక్తి. కొత్తగూడెం కార్పోరేట్ ఏరియాలోని సెంట్రల్ వర్క్ షాప్‌లో శ్రీనివాసరావు పిటర్ విధులు నిర్వహిస్తున్నారు.
ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆయన చిన్న కుమారుడు ప్రణవ్ ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తమ విభాగంలో అత్యధిక మార్కులు సాధించినందుకు స్వర్ణ పతకం, అన్ని విభాగాల్లో మంచి నైపుణ్యం సాధించినందుకు శంకర్ దయాల్ శర్మ గోల్డ్ మెడల్ అందుకున్నాడు ప్రణవ్.

అంతేకాదు ఈ కుర్రాడు మరో వెండి పతకం కూడా సాధించాడు. జూన్ 4వ తేదీన ఖరగ్‌పూర్ ఐఐటీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు కాలేజీ డైరెక్టర్ల చేతుల మీదుగా ప్రణవ్కుఈ మెడల్స్‌ను ప్రదానం చేశారు.