రామవరం, మార్చి 20 : మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశ్యం అని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు సంకు బాపన అనుదీప్ అన్నారు. తమ జీవిత సౌదాల్ని సత్యం, న్యాయం, ధర్మం అనే పునాదుల మీద నిర్మింపజేసుకునేందుకు ఉపయోగపడే సాధనమే ఉపవాస వ్రతం అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ మస్జిద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు.
గంగా జమున తెహజీబ్ మన సంస్కృతిలో ఒక భాగం అన్నారు. కానీ నేడు కొందరు మతాల మధ్య విద్వేషం సృష్టించి లాభపడాలని చూస్తున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. పండుగలు ఏమైనా అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే బాగుంటుందన్నారు. తమ పార్టీ ఎప్పటికీ సెక్యులర్ పార్టీ అన్నారు. 30 రోజుల పాటు ఉపవాస దీక్షను చేస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నానుడిని అందరూ అలవర్చుకుంటే బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడెల్లి యాకయ్య, కలకోటి ఐలయ్య, బావు సతీశ్, అజార్, ఉమర్ జమాతే ఇస్లామీ హింద్ సభ్యుడు అబ్దుల్ బషీద్, కరీం, సోను సాబ్, యాకూబ్, సమీర్, షాకీర్ పాల్గొన్నారు.