టీజీడబ్ల్యూయూఆర్జేసీ విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు
నాగయ్యగడ్డలోని (టీజీడబ్ల్యూయూఆర్జేసీ) గురుకుల పాఠశాలలో యూపీహెచ్సీ రామవరం ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వి.సరిత పాల్గొన్నారు. శిబిరంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఏ.జయలక్ష్మి విద్యార్థినులకు..
రామవరం, జూలై 10 : నాగయ్యగడ్డలోని (టీజీడబ్ల్యూయూఆర్జేసీ) గురుకుల పాఠశాలలో యూపీహెచ్సీ రామవరం ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వి.సరిత పాల్గొన్నారు. శిబిరంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఏ.జయలక్ష్మి విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్‌వాష్ టెక్నిక్స్, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పబ్లిక్ హెల్త్ మేనేజర్ వి.శ్రీనివాసరావు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం (NDD) ప్రాముఖ్యతను వివరించారు.
ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు మింగాలని సూచించారు. దీంతో కడుపులోని నులి పురుగులు నశించి, రక్తహీనత తగ్గడం, ఆకలి పెరగడం, ఆరోగ్యం మెరుగుపడటం, పాఠశాల హాజరు పెరగడం, చదువుతో పాటు ఆటపాటల్లో చురుకుగా పాల్గొనడం వంటి ప్రయోజనాలు ఉంటాయని విద్యార్థినులకు వివరించారు. అలాగే ఐదుగురు విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి, టీకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ నర్స్ జి.రమ్య, ఏఎన్ఎంలు బి.తార, పి.శ్రీలక్ష్మి, ఆశా కార్యకర్త టి.రాజమణి పాల్గొన్నారు.

టీజీడబ్ల్యూయూఆర్జేసీ విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

