చుంచుపల్లి, జూలై 25 : చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ గరిమెళ్లపాడు, ఐటీడీఏ హెచ్ఎంటీసీ (హార్టికల్చర్ నర్సరీ ట్రైనింగ్ సెంటర్) ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శుక్రవారం పరిశీలించారు. హెచ్ఎంటీసీకి సంబంధించిన భవనం అలాగే ఉపాధి హామీలో చేపట్టిన నర్సరీలు, ఐటీడీఏ తోటలు చూసి తగు సూచనలు చేశారు. హెచ్ఎంటీసీ ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రైబల్స్ సొసైటీ ఫార్మ్ చేసి ట్రైబల్ సంక్షేమం, ఐటీడీఏకి రెవెన్యూ వచ్చే పద్ధతులను చేపట్టి హెచ్ఎంటీసీ గరిమెళ్లపాడుని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ నందు గల బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ని సందర్శించారు. పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని పిల్లల భవిష్యత్ కోసం యాజమాన్యం ఎలాంటి పనులు చేయాలి, పిల్లలలో నైపుణ్యం పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీహెచ్ సుభాషిణి, తాసీల్దార్ పి.కృష్ణ, స్కూల్ ప్రిన్సిపాల్, ఐటీడీఏ ఏడీ హార్టికల్చర్ ఉదయకుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘు, ఉపాధి హామీ టీఏలు యశ్వంత్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.