భద్రాద్రి కొత్తగూడెం, జూలై 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి నగర్ శివాలయం ప్రధాన అర్చకుడు ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు మద్దిరాల ముక్తేశ్వర రావుకు అమెరికన్ యునైటెడ్ యూనివర్సిటీ పూదుచ్చేరిలోని కంభన్, కలైరంగం ఆడిటోరియంలో ఫౌoడర్ అండ్ డైరెక్టర్ కె.వెంకటేశం చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి భజన బృందాలను రెండు తెలుగు రాష్ట్రాలలో తయారుచేసి ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈయనకు సంగీతంలో 48 గంటలు హార్మోనియం ప్రదర్శన ఇచ్చినందుకు “హార్మోనియం విధ్వన్వమని” బిరుదుతో సత్కరించారు. కాకినాడలో భజన పోటీలలో అద్భుతమైన న్యాయ నిర్ణేతగా వ్యవహరించినందుకు కాకినాడ కమిటీ ” స్వర్ణ సింహా కంకణం” బహుకరించి సత్కరించింది. “సువర్ణ సింహ తలాట సన్మాన” గ్రహీతగా పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమెరికన్ యునైటెడ్ యూనివర్సిటీ బాధ్యులకు ముక్తేశ్వర రావు ధన్యవాదములు తేలిపారు.