కాకర్లలో హోమియో వైద్య శిబిరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.
– 130 మందికి పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ
జూలూరుపాడు, జూన్ 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 130 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హోమియో వైద్యులు జి. రాధాకృష్ణమూర్తి, టి. రవికాంత్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
అనవసరంగా అధికంగా మందుల వినియోగం చేయకుండా, సరైన జీవన విధానాన్ని అవలంబించడంతో పాటు హోమియో వైద్యం ద్వారా అనేక వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని వివరించారు. అనంతరం గ్రామస్తులకు హోమియో వైద్య విధానం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఖాదరేంద్రబాబు, కె. శ్రీనివాసరెడ్డి, పి.ఎస్.ఎస్. మూర్తి, పి. శ్రీధరరావు, టి. ధనలక్ష్మి, కోటేశ్వరరావు, కరుణ, వీరమల్లు, సీహెచ్. శ్రీమన్నారాయణతో పాటు గ్రామస్తులు రాచబంటి వెంకట నరసయ్య, కళ్యాణం వెంకటప్పయ్య, గోగుల వెంకటేశ్వర్లు, సున్నం ప్రసాద్ పాల్గొన్నారు.

కాకర్లలో హోమియో వైద్య శిబిరం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

