Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Bhadradri Kothagudem | ఎడతెరిపిలేని వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. పెనుబల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గోధుమ వాగుతోపాటు పెనగడప–ములుగుగూడెం వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Bhadradri Kothagudem | చుంచుపల్లి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. పెనుబల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గోధుమ వాగుతోపాటు పెనగడప–ములుగుగూడెం వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులపై ఉన్న బ్రిడ్జిల మీదుగా నీరు పారుతుండటంతో ఆయా గ్రామాల నుంచి కొత్తగూడెం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో పెనుబల్లి వాగు వద్ద స్థానికులు అప్రమత్తమయ్యారు. ఎవరూ వాగు దాటేందుకు ప్రయత్నించకుండా బ్రిడ్జిపై అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపి రాకపోకలను నియంత్రిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగు దాటడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ ప్రజలను అడ్డుకుంటున్నారు.

Bhadradri Kothagudem2
వాగులపై రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలు సరఫరా చేసేవారు, నిత్యావసర సరుకుల కోసం పట్టణానికి వెళ్లేవారు, కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కొనసాగుతుండటంతో వాగుల్లో వరద ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు వరద ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగులు దాటకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Bhadradri Kothagudem3
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

