కరకగూడెం, జూలై 06 : కరకగూడెం మండల కేంద్రంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో సోమవారం పీహెచ్సీ ఆధ్వర్యంలో డా.రవితేజ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన వైద్య సిబ్బంది ఆరోగ్య సూత్రాలను వివరించారు. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వ్యాధులపై అవగాహాన కలిగి ఉంటూ సకాలంలో ముందులు వేసుకోవాలని తెలిపారు. అనంతరం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా నవోదయ పాఠశాల ప్రధానోపాధాయ్యులు రత్నయ్య జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులపై విద్యార్థులకు వివరించారు. పెంపుడు జంతువులైన పశువులు, కుక్కలు, పిల్లులు, పక్షులు, కోళ్లు వంటి జంతువుల నుండి మనుషులకు సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చక్రవాణి, గౌతమి, నిఖిల, సందీప్ కుమార్ సింగ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.