– కొత్తగూడెం ఏరియా జీఎం శాలేం రాజు
– నూతన డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్‌కు శుభాకాంక్షలు
రుద్రంపూర్, జూలై 04 : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్‌ను సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు శనివారం ఇల్లెందు గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించిన జీఎం శాలేం రాజు, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి కార్యక్రమాల అమలులో అటవీ శాఖ విశేష సేవలు అందించాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న హరితహారం, మొక్కల పెంపకం, గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి వంటి కార్యక్రమాల గురించి వివరించారు. అటవీ శాఖ–సింగరేణి సంస్థల మధ్య పరస్పర సహకారంతో పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, గనుల పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వి.కె.సి.ఎం. ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.