ఇల్లెందు, అక్టోబర్ 07 : ఇల్లెందు పట్టణం మెయిన్ రోడ్ ఆర్.సి.ఎం చర్చి (పరిశుద్ధ జపమాల మాత దేవాలయం) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఇల్లెందు మెయిన్ రోడ్ ఆర్.సి.ఎం చర్చ్ ఫాదర్ ఏ.సునీల్ జయ ప్రకాష్ ఆధ్వర్యంలో చర్చి 50 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్.సి.ఎం సంఘం ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాశ్ డి.డి పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓసిడి ఫాదర్ అమృత రాజు, డీన్ ఫాదర్ జయానంద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు ఫాదర్లు, సిస్టర్లు, పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.