‘జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి.. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం’
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జూపెల్లి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో...
– బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జూపెల్లి దుర్గాప్రసాద్
రుద్రంపూర్, ఆగస్టు 22 : పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జూపెల్లి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జీవో 97కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను శక్తి విభాగం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. దీంతో రాష్ట్రంలోని సుమారు 75 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలోకి తీసుకెళ్లడం, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే డిప్లొమా విద్యార్థులకు ఉన్న ECET ద్వారా బీటెక్‌లో లాటరల్ ఎంట్రీ అవకాశాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక డిప్లొమా విద్యా ప్రమాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీవో 97ను వెంటనే నిలిపివేయకపోతే విద్యార్థుల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడెల్లి ముఖేష్, వాసు, మల్ల గౌతమ్, రవితేజ, నజీర్, సన్నీ పాల్గొన్నారు.

‘జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి.. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

