మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పెన్‌పహాడ్ మండలంలోని మేగ్య తండా నుండి గంగ్లీ తండా వరకు 1 కోటి 84 లక్షల రూపాయల ట్రైబల్ ఫండ్ ద్వారా విడుదలైన బీటీ రోడ్డు నిర్మాణం పనులకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పెన్‌పహాడ్, అక్టోబర్ 29 : పెన్‌పహాడ్ మండలంలోని మేగ్య తండా నుండి గంగ్లీ తండా వరకు 1 కోటి 84 లక్షల రూపాయల ట్రైబల్ ఫండ్ ద్వారా విడుదలైన బీటీ రోడ్డు నిర్మాణం పనులకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో మెరుగైన రహదారి సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే మేఘ్యతండ, గంగ్లీ తండ గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం తగ్గి, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య రాజు నాయక్, సూర్యాపేట మార్కెట్ మాజీ చెర్మన్ తూముల భుజంగా రావు, యాట ఉపేందర్, వరలక్ష్మి, వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, కళ్యాణ్, కరుణ రెడ్డి, కొండేటి పవన్, కృష్ణ, మనోహర్, దస్రూ నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Megaverse | ‘మెగావర్స్’గా మెగాస్టార్ కొత్త ప్రయాణం.. ‘ అఫీషియల్ ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

