YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
YCP Letter | ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ( YCP ) లేఖ రాసింది. పింఛన్ల పంపిణీ ( Pension Distribution) పేరుతో టీడీపీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పింఛన్ల పంపిణీని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఆరోపించింది.
అక్టోబర్ 30న పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, పింఛన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల పంపిణీ ప్రారంభానికి ముందే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

