Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
'ai Shree Ram | నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్-ఇండియా మైథలాజికల్ మూవీ 'రామాయణ' (Ramayana) క్రేజ్ కేవలం భారత్‌కే పరిమితం కాలేదు.
‘ai Shree Ram | నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్-ఇండియా మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ (Ramayana) క్రేజ్ కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై తమ అభిమానాన్ని చాటుకుంటూ పాకిస్తాన్‌లోని హిందూ కమ్యూనిటీ సభ్యులు కరాచీలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.
పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉన్న హిందూ కమ్యూనిటీ ప్రజలు ఒక్కచోట చేరి, చేతిలో ‘రామాయణ’ సినిమా పోస్టర్లు పట్టుకుని డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా “మేరే ఘర్ రామ్ ఆయే హై” అంటూ భక్తి పారవశ్యంతో భజనలు చేస్తూ వారు నృత్యాలు చేశారు. ఆ ప్రాంతం మొత్తం “జై శ్రీరామ్”, “సియావర్ రామచంద్ర కీ జై” అనే నినాదాలతో మార్మోగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కరాచీలోని ఒక చారిత్రాత్మక శ్రీరామ మందిరానికి చేరుకున్న భక్తులు, ఆలయ ప్రాంగణంలో ‘రామాయణ’ సినిమా పోస్టర్‌ను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవిలపై తమకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించాలని, మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ‘ఆస్కార్’ అవార్డును కూడా గెలుచుకోవాలని వారు హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. ఈ అద్భుత దృశ్య కావ్యమైన ‘రామాయణ’ చిత్రాన్ని తమ దేశంలోని థియేటర్లలో కూడా విడుదల చేయాలని మేకర్స్‌ను అక్కడి హిందూ సోదరులు కోరారు. అయితే, పాకిస్తాన్లో భారతీయ సినిమాల ప్రదర్శనపై కఠిన నిబంధనలు ఉన్నందున, అక్కడ ఈ సినిమా రిలీజ్ పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Hindus from Pakistan are celebrating the arrival of Ramayana in Karachi, Also Requesting the makers to release the movie in their country.
Jai Shree Ram chants all over🤯🤯 https://t.co/4V5bSCMIwY
— KBP Reviews🏹 (@KshitizCritic) October 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

