Singareni : జీఎం శాలెం రాజుకు ఘన సత్కారం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికైన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును సింగరేణి కాలరీస్ ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీఎం కార్యాలయంలో..
రుద్రంపూర్, ఫిబ్రవరి 02 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆఫీసర్‌గా ఎంపికైన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును సింగరేణి కాలరీస్ ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీఎం కార్యాలయంలో శాలువా, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శాలెం రాజు సమర్థ నాయకత్వం, కృషి, పట్టుదల వల్లే కొత్తగూడెం ఏరియా ప్రతి సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలను మించి సాధిస్తూ సింగరేణి సంస్థలో ముందంజలో నిలుస్తోందన్నారు. ఈ అవార్డు ఏరియా కార్మికులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కపాటి వెంకటేశ్వరరావు, కలవల చంద్రశేఖర్, భూక్య రాందాస్, నాయుడుపెల్లి యోహన్, జి.లక్ష్మణ్, అనిల్ కుమార్, జిమ్మిని మల్లేష్, అజ్మీర శ్రీనివాస్, దౌర్య, పొన్నగంటి అంకుస్, చెరుపల్లి నాగరాజు, కె.మణి విక్టరీ, మొగిలిపాక రవి, మోహన్ పీవీకే పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

