రామవరం, సెప్టెంబర్ 25 : అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్లకు బాలికలు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వంటి కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరిన బాలికలు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులన్నారు. ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలల్లో 10వ, 12వ తరగతులు ఉత్తీర్ణులైన బాలికలే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది స్పాట్ అడ్మిషన్లు పొందిన బాలికలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ స్కాలర్షిప్నకు ఎన్నికైన వారు సంవత్సరానికి రూ.30 వేలు పొందుతారన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ www.azimpremjifoundation.org లేదా మైనారిటీ సంక్షేమ సంఘం నంబర్ 8520860785కి కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.