బూర్గంపహాడ్, జూన్ 18 : విద్యాభివృద్ధికి బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండి పంచాయతీ పూర్తి సహకారం ఉంటుందని పంచాయతీ సర్పంచ్ గుండి బాబూరావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఎంపీయూపీఎస్ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, విద్యార్ధికి ఏ అవసరం ఉన్నా పంచాయతీ నుండి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, వార్డు సభ్యురాలు గుగులోతు దుర్గ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.