కొత్తగూడెం అర్బన్, మే 30 : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో ఎస్సీ మహిళలకు టైలరింగ్‌లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా డైరెక్టర్ వెంకటరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం పట్టణం ప్రగతి మైదాన్‌లోని న్యాక్ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ఈ కోర్సులో (బ్లౌజు డిజైన్స్, పంజాబీ డ్రెస్ డిజైన్స్, ఫ్రాక్స్, నిక్కర్, షర్ట్, మోడల్ బ్లౌజులు) శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్, సర్టిఫికేట్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన మహిళలు ఆధార్ కార్డ్, ఫొటోలు (4), రేషన్ కార్డు, ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్స్‌తో శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 నుండి 35 సoవత్సరాల వయస్సు కలిగిన మహిళలు శిక్షణకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9292650982 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవాల్సిందిగా సూచించారు. కొత్తగూడెం జిల్లాలోని ఎస్సీ మహిళలు ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.