చండ్రుగొండ, మార్చి 15 : ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చండ్రుగొండ బీఆర్ఎస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సుర వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీకి అండగా ఉండే నామ అందరికీ ఆదర్శప్రాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కొనకండ్ల వెంకట్రెడ్డి, ధారా బాబు, సంగండి రాఘవులు, సురా వెంకటేశ్వరరావు, నరుకుల సత్యనారాయణ, మేడ మోహన్రావు, భూపతి రమేశ్, గూగులోత్ రమేశ్, చాపలమడుగు రామరాజు, సత్తి నాగేశ్వరరావు, పాండ్ల అంజన్న రావు, గూగులోత్ శివ, శ్రావణ్, బాద్షా, పత్తిపాక చిన్న వెంకన్న, కల్లెం వెంకటేశ్వర్లు, గఫార్మియా, ఆకుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.