చండ్రుగొండ, జూన్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను సోమవారం బీఆర్ఎస్ చండ్రుగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండే మెచ్చ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనకండ్ల వెంకట్రెడ్డి, ధారా వెంకటేశ్వరరావు, సంగొండి రాఘవులు, నల్లమోతు వెంకటనారాయణ, భూపతి రమేశ్, సూరా వెంకటేశ్వరరావు, నరుకుల్లా వాసు, సత్తి నాగేశ్వర్రావు, సయ్యద్ గఫార్మియా, కేలోతు శ్రీను, భూపతి శ్రీనివాసరావు, మద్దిరాల చిన్న పిచ్చయ్య, శ్రావణ్ కుమార్, పాండ్ల అంజన్రావు పాల్గొన్నారు.
Chandrugonda : మాజీ ఎమ్మెల్యే మెచ్చ జన్మదిన వేడుకలు