రామవరం ,ఆగస్టు 30 : కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు వర్క్ షాప్ డీ.జి.ఎం(ఈ& ఎం)టి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం సేఫ్టీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏరియాలో ఉన్న త్రీ ఇంక్లైన్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, త్రీ ఇంక్లైన్ ఫిల్టర్ బెడ్ ను సేఫ్టీ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. త్రీ ఇంక్లైన్ లో పాత సబ్ స్టేషన్ రూమ్ శిథిలావస్థలో ఉన్నందున కొత్త సబ్ స్టేషన్ రూమ్ నిర్మించడం జరిగింది, కొత్త రూమ్ లోకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేశారు. అందులోని పాత సబ్ స్టేషన్ రూమ్‌ను డిస్మెంటల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సబ్ స్టేషన్ చుట్టూ మెస్ ఏర్పాటు చేయాలి. ఏరియా వర్క్ షాప్ కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల ఫస్ట్ ఎయిడ్ రూమ్ నిర్మించాలన్నారు. వర్క్ షాప్ లో ఎండ, వర్షం వచ్చినప్పుడు ఉద్యోగులు మస్టర్ చెప్పేటప్పుడు ఇబ్బంది అవుతున్నందున మాన్వే ముందు షెడ్డు నిర్మించాలన్నారు.
వర్క్ షాప్ లోని ఆర్ఓ ప్లాంట్ సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కావున ఆర్వో ప్లాంట్ ను రిపేర్ చేయించాలన్నారు. అలాగే వర్క్ షాప్ నందు స్టేజ్ ఏర్పాటు చేయగా దానిపైన రేకులు, ఫ్లోరింగ్ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. క్యాంటీన్ నిర్మించాలని, ఫోర్క్ లిఫ్టర్, అలాగే సేఫ్టీకి సంబంధించిన పరికరాలు ఉద్యోగులందరికీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ ఇంజినీర్స్ బి.శంకర్, టి.అనిల్, ఏ.ఉపేందర్ బాబు, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.మధు కృష్ణ, ఎలక్ట్రికల్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ వై.రవి, సేఫ్టీ కమిటీ సభ్యులు ఎస్డీ యాకువుద్దీన్, సలిగంటి తిరుపతి, గుమ్మడి మురళి, కె.కరుణాకర్, ఏ.మహేశ్, సీహెచ్.జాన్ కేనేడీ, జూనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు.