విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
మా ఉత్పత్తి నలుపు.. మా లక్ష్యం పచ్చదనం.. సింగరేణి సంస్థ నినాదం ఇదైతే, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పచ్చని చెట్లను సంరక్షించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఏపుగా పెరిగిన వేప చెట్లు...
రుద్రంపూర్, అక్టోబర్ 10 : మా ఉత్పత్తి నలుపు.. మా లక్ష్యం పచ్చదనం.. సింగరేణి సంస్థ నినాదం ఇదైతే, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పచ్చని చెట్లను సంరక్షించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఏపుగా పెరిగిన వేప చెట్లు నేలకూలుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీకి వెళ్లే వ్యాలీ రోడ్డులో విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు అడ్డుగా వస్తున్నాయనే కారణంతో వాటిని తొలగించాల్సింది పోయి, పచ్చని చెట్లనే నరికివేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమ్మలను కత్తిరించి విద్యుత్ తీగలకు ఆటంకం లేకుండా చేసే అవకాశం ఉన్నప్పటికీ, యంత్రాలతో చెట్లను నేలకూల్చడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మొక్కలు నాటడం ఒకవైపు.. చెట్ల నరికివేత మరోవైపు
ప్రతి సంవత్సరం హరితహారం, వన మహోత్సవం పేరుతో సింగరేణి యాజమాన్యం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, మరోవైపు ఏపుగా పెరిగిన చెట్లను నరికివేయడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సంస్థ ప్లాంటేషన్లలో పెంచిన మొక్కల కంటే యంత్రాలతో నేలకూల్చుతున్న చెట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సంస్థ నాటిన చెట్లు కాకపోయినా, పర్యావరణానికి మేలు చేసే పచ్చని వృక్షాలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని నిలదీస్తున్నారు.
కాంట్రాక్టర్‌తో పాటు పర్యవేక్షణ అధికారులపైనా చర్యలు తీసుకోవాలి
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించే పనుల పేరుతో చెట్లను నరికివేసిన కాంట్రాక్టర్‌పై, పనులను అప్పగించి పర్యవేక్షణను విస్మరించిన బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, సింగరేణి ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా చెట్ల నరికివేత జరిగిందా అనే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పచ్చని చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ నినాదాలకే పరిమితం కాకుండా, పచ్చని చెట్లను కాపాడటంలోనూ సింగరేణి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు సూచిస్తున్నారు.

విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

