– మణుగూరు ఏడీఏ తాతారావు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 22 : రైతులు ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మణుగూరు ఏడీఏ తాతారావు తహశీల్దార్ కేఆర్కే ప్రసాద్, సర్పంచ్, ఉప సర్పంచులు మందా నాగరాజు, గుండె వెంకన్నలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతుల పంటను కొనుగోలు చేసే విషయంలో పారదర్శకత పాటించాలని, రైతులు పండించిన చివరి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
రైతులు పంటను దళారులకు విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శంకర్, పీఏసీఎస్ సీఈవో ప్రసాద్, స్థానిక నాయకులు భజన సతీష్, భజన నర్సింహారావు, పేరం వెంకటరెడ్డి, మేకల వెంకన్న, గోనెల వెంకటేశ్వర్లు, గోనెల సతీష్, గాదె వెంకటేశ్వరరెడ్డి, పాశం రాజు, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.