ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపినప్పుడే జీవితం సాఫీగా సాగుతుందని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..
బూర్గంపహాడ్, ఏప్రిల్ 07 : ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపినప్పుడే జీవితం సాఫీగా సాగుతుందని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మోరంపల్లిబంజర్ పీహెచ్సీ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కేజీబీవీ పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బందికి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. ఆరోగ్య ప్రాముఖ్యత కోసం విద్యార్ధులు తీసుకోవాల్సిన, పాటించాల్సిన అంశాలను వివరించారు.
తొలుత పీహెచ్సీలో రికార్డులు పరిశీలించి ఆశాలు, ఆరోగ్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆశాలు, ఆరోగ్య సిబ్బందికి సమావేశం నిర్వహించి గర్భిణీల నమోదు, అధిక ప్రమాద గర్భధారణల గుర్తింపు, నిర్వహణ ప్రారంభ దశలో ఏఎన్సీ నమోదు మెరుగుదలపై అవగాహన కల్పించారు. రోగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందుతున్న వైద్యంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీధర్, ఎంపీ బంజర్ వైద్యులు నవీన్, డీపీఎంఓ మోహన్, ఎంపీహెచ్ఐఓ రవి, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశాలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

