అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, భూ రీ సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఇల్లెందు ప్రాంతంలో...
ఇల్లెందు, అక్టోబర్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, భూ రీ సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఇల్లెందు ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు, మామిడి గుండాలలో భూ రీ సర్వే పనులు, జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు సంబంధించి చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల్లో భాగంగా ఇల్లందులోని సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. నూతన ఓటరు నమోదు కోసం ఫారం-6 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, నమోదు ప్రక్రియ పురోగతిని బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఇల్లెందు మండలం మామిడి గుండాలలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతి, భూముల విస్తీర్ణం, గతంలో జారీ చేసిన పట్టాలు, భూ రికార్డులు, సరిహద్దుల నిర్ధారణకు సంబంధించిన వివరాలను సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి పాత రికార్డులు, మ్యాప్లను పరిశీలించి, గతంలో పట్టాలు జారీ చేసిన భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల హద్దుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. బోటి గుంపులో మొత్తం 4,733 ఎకరాల భూమి ఉన్నట్లు, గ్రామ పరిధిలోని 130వ సర్వే నంబరులో సుమారు 4,200 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు సర్వే సిబ్బంది కలెక్టర్కు వివరించారు. భూ సరిహద్దుల నిర్ధారణలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి, నెల రోజుల్లోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా ఎంపీడీవో, ఏపీఎం అందుబాటులో లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి స్థలాల పరిశీలనకు సంబంధించి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వేను కూడా కలెక్టర్ పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును, స్థలాల వాస్తవ పరిస్థితులను, దరఖాస్తుదారుల వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. స్థలాల విస్తీర్ణం, సరిహద్దులు, వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించాలని, సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను సంబంధిత రికార్డులతో ధ్రువీకరించి, తదుపరి ప్రక్రియను నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కాశీరాం, జిపిఓ లక్ష్మీకాంత్, మామిడి గుండాల సర్పంచ్ ఎట్టి రమణ మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

