చుంచుపల్లి, ఆగస్టు 16 : తెలంగాణా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం ఆధ్వర్యంలో శనివారం అసోసియేషన్ సభ్యులు రామచంద్రమూర్తి 80వ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు జ్యోతి ఆశ్రమానికి రూ.10 వేల విలువైన నిత్యావసర సరుకులు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆశ్రమానికి ప్రతి నెలా నిత్యావసర సరుకులు అందిస్తూనే ఉన్నామని, ఇక ముందు కూడా తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ సురేశ్ కుమార్, పాండురంగారావు, శివరామకృష్ణ, ,సీతారామశాస్త్రి, జోసెఫ్, కామేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, గురుమూర్తి పాల్గొన్నారు. అలాగే జోసెఫ్ కుమారుడు డాక్టర్ ఆర్జే ప్రశాంత్ జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు.