భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ 133 ఏండ్ల చరిత్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటిమంది లబ్ధి పొందారని సంస్థ డైరెక్టర్ పా, ఫైనాన్స్, ప్రాజెక్ట్&ప్లానింగ్ ఆఫీసర్ బలరాం అన్నారు. గురువారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో జరిగిన 133వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. సింగరేణి సంస్థ సమిష్టి కృషి వల్లనే లక్ష్యాన్ని సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, సత్యనారాయణ రావు, జీఎంలు ఆనందరావు, బసవయ్య కుమార్ రెడ్డి, TBGKS అధ్యక్షుడు B వెంకట్రావు, కార్పొరేట్ ఉపాధ్యక్షుడు ముప్పాని సోమిరెడ్డి, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.