ఓపీఎస్‌కే మన ఓటు.. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నా
కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగులు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్ అన్నారు. పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం కలెక్ట్రెట్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా...
భద్రాద్రి కొత్తగూడెం. నవంబర్ 17 : కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగులు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్ అన్నారు. పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం కలెక్ట్రెట్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సర్కారు దిగి వచ్చేదాకా దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో అంగన్వాడీ శాఖ ముందువరుసలో ఉండి కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. సంఘాలకు అతీతంగా జరిగిన ఈ ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు రావడం శుభ పరిణామమన్నారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు లక్ష్మణ్, రవి. అంగన్వాడీ నాయకురాలు ధనలక్ష్మి, రాజశేఖర్, గోరుంట్ల సురేశ్, నాగునాయక్ పాల్గొన్నారు. ఉద్యోగుల ధర్నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఓపీఎస్‌కే మన ఓటు.. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నా
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓపీఎస్‌కే మన ఓటు.. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నా
Vera Dijkmans | అమెరికా అధికారుల అదుపులో ప్రపంచ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ వెరా డిజ్క్మాన్స్..!
Jagadish Reddy | కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు : కాంగ్రెస్ మేనిఫెస్టోపై జగదీష్ రెడ్డి
‘కాంగ్రెస్ దొంగ హామీలకు నేటితో మూడేళ్లు’
Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను వెంటనే వాయిదా వేయాలి.. సీఎంకు మేధావుల బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

