– ఎంపీ వద్ది రాజు సమక్షంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 02 : మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేటపేట, ఇల్లెందు, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో భారీగా చేరారు. కొత్తగూడెం 53వ డివిజన్ మేదరబస్తీకి చెందిన మహేష్, భాస్కర్ తదితరులు మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ ఆధ్వర్యంలో కొత్తగూడెం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.