రామవరం, ఆగస్టు 16 : అహలే సున్నత్వల్ జామాత్ (ఏ.ఎస్.జే.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని సంఘం సభ్యులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ ఖాద్రీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ నూతన ఛైర్మన్‌గా ఎం.ఏ.రజాక్, జిల్లా అధ్యక్షుడిగా షేక్ అబ్దుల్ కరీం ఖాద్రీ, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, షేక్ యఖుబ్ ఖాద్రీ, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ హుస్సేన్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహమ్మద్ యూసఫ్, షేక్ అన్వర్ పాషా, మహమ్మద్ యాకుబ్,
కోశాధికారిగా సయ్యద్ యాకూబ్ ఉద్దీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహమ్మద్ షమీ, జిల్లా అధికార ప్రతినిధిగా అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ పాషా, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ దావూద్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ షఫి, మహమ్మద్ అస్లాం, చుంచూపల్లి మండల అధ్యక్షుడిగా మహమ్మద్ షకీల్, జిల్లా కమిటీ సభ్యులుగా మహమ్మద్ అక్తర్ పాషా, షేక్ నయీమ్ ఛీస్తీ, సెక్రటరీ జనరల్‌గా మహమ్మద్ మహబూబ్ ఖాద్రీ, మహమ్మద్ అలీం ఉద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఒక ఏడాది పాటు పదవీలో కొనసాగనుందని ఏ.ఎస్.జే. చైర్మన్ ఎం.ఏ.రజాక్ తెలిపారు.