జూలూరుపాడు, మే 22 : భానుడి భగభగలకు భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ప్రాణం గాల్లో కలిసింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు తాళలేక వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన మంద గోపయ్య (75) గత రెండు రోజులుగా తీవ్రమైన వడదెబ్బకు గురయ్యాడు. ఎండల ప్రభావంతో ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో ఆయన శరీరం పూర్తిగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన కన్నుమూశారు. గోపయ్యకు భార్య సావిత్రమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.