రామవరం, జూన్ 16 : కొత్తగూడెం ఏరియాలోని పర్సనల్ డిపార్ట్మెంట్ పనులను పూర్తి చేస్తామని, ఉద్యోగులను పలుమార్లు కార్యాలయాలకు తిప్పుకోకుండా వారి సమస్యలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని కొత్తగూడెం ఏరియా డిప్యూటీ జీఎం (పర్సనల్) గామలపాటి వెంకట మోహన్రావు తెలిపారు. సోమవారం విధుల్లో చేరిన సందర్భంగా పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వెంకట మోహన్రావు మాట్లాడుతూ.. అందరి సహకారంతో నిజాయితీగా పనిచేస్తూ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవై పి.ఎం గోవర్ధన హరీష్, సీనియర్ పిఓలు మజ్జి, మురళి, మొహమ్మద్ మాథీన్ హుస్సేన్, జీఎం ఆఫీస్ ఫిట్ సెక్రెటరీలు, ఏఐటీయూసీ యూనియన్ కె.సౌజన్య, ఐఎన్టీయూసీ యూనియన్ సీహెచ్.సాగర్, ప్రసాద్, ఉమర్, కిశోర్, అరవింద్, వెంకట రమణ, సౌజన్య, శివ చరిత, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.