రామవరం, జులై 07 : గనులు, ఉపరితల గనుల్లో ఈ.పీ ఆపరేటర్స్, మోటార్ వెహికల్ డ్రైవర్స్ వాహనాలు నడిపినప్పుడు వేగ నియంత్రణను తప్పక పాటించాలని, అలాగే బొగ్గు రవాణా చేస్తున్నప్పుడు కూడా వేగం నియంత్రణ పాటించాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ఎం.వి.టి.సి) నందు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ (ఎస్.ఎం.పి) ఇంప్లిమెంటేషన్పై ఈ.పీ ఆపరేటర్స్, మోటార్ వెహికల్ డ్రైవర్స్ రెండు రోజుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జిఎం ఎం.షాలెం రాజు, & జిఎం (సేఫ్టీ) చింతల శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా బొగ్గు ఉత్పత్తికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మైన్స్ , ఉపరితల గనుల ఆవరణంలో తిరిగే వాహనాలకు తప్పక మెయింటెనెన్స్ వర్క్ చేయించాలని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వి.మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, జీకేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రమేశ్, ఎస్ ఓ టు జిఎం జీవీ కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, డిజిఎం (ఐఎస్ఓ) జీ.వీ.ఎం.ఎస్ విజయకుమార్, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఏం.వెంకటేశ్వరరావు, ఎంవిటీసీ మేనేజర్ జి.లక్ష్మణ్ ఎంవిటీసీ ఆఫీసర్ కె.చంద్రశేఖర్ పాల్గొన్నారు.