బూర్గంపహాడ్, జూన్ 01 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని కబరస్థాన్లో ఎమ్మెల్యే సొంత నిధులతో మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కబరస్థాన్లో మంచినీటి వసతి లేక అంత్యక్రియల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గతంలో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మహ్మద్పాషా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన కబరస్థాన్లో బోరు ఏర్పాటు చేయించడంతో మైనార్టీ నాయకులతో పాటు స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రహరీ లేకపోవడంతో ఆ నిర్మాణం కూడా త్వరలో చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, భజన సతీశ్, కైపు శ్రీనివాసరెడ్డి, గుద్దేటి ప్రవీణ్, బీబ్లాక్ మహిళా నాయకురాలు బర్ల నాగమణి, మైనార్టీ నాయకులు ఆరీఫ్, నయీమ్, దస్తగిరి పాల్గొన్నారు.