టేకులపల్లి, అక్టోబర్ 28 : దుకాణాల ఎదుట, రోడ్లపై వాహనాలను విచ్చలవిడిగా నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రహదారులపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గుట్కా, తంబాకు, కైని వంటి ఉత్పత్తులను విక్రయించవద్దని దుకాణదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.