రామవరం, సెప్టెంబర్ 19 : సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లను తీసుకుని అవసరం ఉన్న ప్రదేశాల్లో అమర్చుకుని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియాలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గరీబ్ పేట్ గ్రామానికి సోలార్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల పంపిణీ కార్యక్రమాన్ని జీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో బాగంగా గరీబ్ పేట్ గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామ ప్రజలకు 15 సోలార్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు అందజేసినట్లు తెలిపారు. సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశానుసారం డైరెక్టర్ (పి&పి) కె.వెంకటేశ్వర్లు సహకారంతో నేడు 15 సోలార్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు, 04 విద్యుత్ స్తంభాలు, 100 ట్రీ గార్డ్స్ లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ వి.మల్లికార్జున రావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్, ఎస్ఓటు జీఎం జి.వి.కోటిరెడ్డి, వికే కూల్ మైన్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రమేశ్, ఏజీఎం(సివిల్) సీహెచ్ రామకృష్ణ, డీజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, జీఎం కార్యాలయంలోని వివిధ విభాగాల అధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది యూనియన్ ప్రతినిధులు, గరీబ్ పేట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ రోహిణి, గరీబ్ పేట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.