రామవరం, నవంబర్ 26 : సీసీబీ నగర్, రామవరం సీఆర్పీ క్యాంప్‌లో కొదమసింహం పాడురంగాచార్యుల ఆధ్వర్యంలో బుధవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. అంజనేయ స్వామి దేవాలయం తరఫున కొదమసింహం పాడురంగాచార్యులు, ఎన్.సి.హరి, లక్ష్మణాచార్యులు కలిసి మొత్తం 21 మంది దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.