రజత కవచాలంకరణలో శ్రీ కనకదుర్గ అమ్మవారు .. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు
గౌతంపూర్ పంచాయతీ పరిధిలోని శ్రీ కనకదుర్గ చంద్రమౌళీశ్వర దేవాలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
చుంచుపల్లి, అక్టోబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ పంచాయతీ పరిధిలోని శ్రీ కనకదుర్గ చంద్రమౌళీశ్వర దేవాలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని రజత కవచం, వివిధ ఆభరణాలు, రంగురంగుల పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు అనిల్ శర్మ తెలిపారు. భక్తులు భవానీ మాలలు ధరించి తొమ్మిది రోజుల పాటు నియమనిష్ఠలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

