పాల్వంచ, డిసెంబర్ 30 : నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, పాల్వంచ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్య పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం డెస్క్ (బల్లలు) బెంచీలను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ & జడ్పీ సీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం బి.నాగలక్ష్మి చేతుల మీద మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్య పాఠశాలలకు నవ భారత్ ఎనర్జీ అధించిన సహకారాల గురించి ప్రస్థావించారు. పలు ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ ప్రయోగ శాలలు, ప్రయోగ పరికరాలు అందించినట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాటానికి నైపుణ్యం గల ఉపాధ్యాయులను నియమించడం సంతోషదాయకం అన్నారు.
అలాగే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఏర్పాటుతో పాటు 39 ప్రభుత్య పాఠశాలల విద్యార్థులు మరుగుదోడ్లు లేక ఇబ్బంది పడుతుంటే వారికి వాష్‌రూమ్స్, హ్యాండ్‌వాష్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ సి.ఎస్. ఆర్, ఎం. జి. ఎం ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభుత్య పాఠశాలలో నవ లిమిటెడ్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రభుత్య పాఠశాలలకు 4,500 బల్లలను అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరామ్మూర్తి, నవ భారత్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.వి.కే.ప్రసాద్, నవ భారత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.జ్యోతి, రాజేశ్వరరావు, రాజేశ్ పాల్గొన్నారు.