రామవరం, ఆగస్టు 01 : చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న బస్టాండ్ పక్కన ఓ శునకం చనిపోయి పడిఉంది. కొన్ని రోజులుగా అది అలాగే ఉండడంతో కుళ్లిపోయి, పురుగులు పడి దుర్గంధాన్ని వెదజల్లుతుంది. దీంతో బస్ షెల్టర్లో కూర్చోవాలంటేనే వాంతికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. బాలింతలు, చిన్నపిల్లలు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుని తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో బస్టాండ్లో బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. అయితే అక్కడ ఒక నిమిషం కూడా కూర్చోలేని పరిస్థితి. వర్షాలు పడుతుంటే జనాలు వర్షంలో తడుస్తూనే బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తుంది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, సిబ్బంది స్పందించి చనిపోయిన శునకాన్ని తొలగించి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.