పాల్వంచ, ఏప్రిల్ 18 : పాత పాల్వంచలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్‌ను 47వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో 16 జట్లు పోటీ పడుతున్నాయి. టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్ జట్టుకు రూ.30 వేలు, రన్నర్ జట్టుకు రూ.15 వేల నగదు బహుమతి, బెస్ట్ ప్లేయర్, బెస్ట్ వికెట్ కీపర్, తదితర క్రీడాకారులకు షీల్డ్‌లను అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పోటీలు రెండు రోజులు పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో 38 డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్, బీఆర్ఎస్ నాయకుడు ముత్యాల ప్రవీణ్, సీపీఐ నాయకుడు మస్తాన్ పాల్గొన్నారు.

పాత పాల్వంచలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం