కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 24 : కొత్తగూడెం మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే.రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో కిన్నెరసాని నీళ్లు ప్రతిరోజు అందించాలని, అలాగే డ్రైనేజీలు శుభ్రచేయాలని, అవసరమైన చోట కొత్త డ్రైనేజీలు, అంతర్గత సీసీ రోడ్లు నిర్మించాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలం లేని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్నారు. 76 జీఓ క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించాలని, కోతులు, కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ మెంబర్ భూక్య రమేశ్, డి.వీరన్న, ఎస్.లక్ష్మి, నందిపాటు రమేశ్, జునుమాల నగేశ్ పాల్గొన్నారు.
Kothagudem : కొత్తగూడెం మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ధర్నా