రామవరం, మే 13 : కొత్తగూడెం ఏరియాలోని అన్ని మైన్స్/డిపార్ట్మెంట్లలో విధులకు గైర్హాజరవుతున్న కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ నందు గల ఆర్.సి.ఓ.ఎ. క్లబ్ నందు ఉదయం 09.30 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో 2025 సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు 60 మాస్టర్లు, అంతకన్నా తక్కువ మాస్టర్లు చేసిన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులతో గైర్హాజరకు కారణాలైన తగు పత్రాలతో కౌన్సిలింగ్కు హాజరు కావాలని పేర్కొన్నారు.