రామవరం, జూన్ 24 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వంగాల శ్రీనివాస్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. సిబ్బంది హడావిడిలో ఉండగా దాన్ని అదునుగా భావించి పీవీకే 5 ఇంక్లైన్ తీసివేసిన ఫ్యాన్ హౌస్ వద్ద 7 ఇంక్లైన్, పీవీకే గనుల నుండి కాపర్ కేబుల్ ను తీసుకొని వచ్చి అక్కడ చేర్చారు. దీనిని అదునుగా భావించిన దొంగలు కాపర్ కేబుల్‌ను అపహరించుకుపోయారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా కేబుల్ దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతాన్ని గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలోని వారిని గుర్తించేందుకు స్థానికులు, ఎస్ అండ్ పి సి డిపార్ట్మెంట్లోని ఉద్యోగుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు.