బూర్గంపహాడ్, మే 15 : తక్షణమే సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు శుక్రవారం బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసీల్దార్కు ఆ సంఘం జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి పాండవుల భిక్షం, సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలకవర్గాన్ని కొనసాగించాలని మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 13 మంది సభ్యుల పాలకమండలి సభ్యులను అధ్యక్ష, డైరెక్టర్ పదవుల్లో నామినేటెడ్ చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తక్షణమే సహకార సంఘం ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి మల్సూర్, భూక్యా శ్రీను, సింగంబోయిన వెంకటేశ్వర్లు, ఎట్టి భద్రు పాల్గొన్నారు.