– తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న బీఆర్ఎస్ నాయకుడు మండవ సత్యనారాయణ
దమ్మపేట, జూలై 22 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో దమ్మపేట మండలం గండుగులపల్లిలోని పల్లె ప్రకృతివనంలో వీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షుడు మండవ సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడుతుందని, ఆహ్లాదంగా ఉండటానికి ఆనాడు పల్లె ప్రకృతివనాలు కేసీఆర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించకుండా ఉండటానికి నేడు గ్రామంలో ప్రజాప్రతినిధులు ఇద్దరూ ఎమ్మెల్యే, మంత్రి ఊద్దేశ పూర్వకంగా వీఓ కార్యాలయం నిర్మాణం చేయిస్తున్నట్లు ఆరోపించారు. వీఓ కార్యాలయం ఊరు మధ్యలో నిర్మాణం చేస్తే అందరికి ఊపయోగంగా ఉంటుందన్నారు. ప్రజల కోరిక మేరకు తక్షణమే పల్లె ప్రకృతివనంలో వీఓ భవన నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని మండవ సత్యనారాయణ హెచ్చరించారు.