ఇల్లెందు, ఏప్రిల్ 1 : హామీల అమలులో విఫలమైనందున రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై కేసులు నమోదు చేయాల్సిందిగా కోరుతూ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సందీప్‌కి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆరు గ్యారంటీల అమలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అలిమి కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు గాను వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా చేసినట్లు చెబుతున్నందుకు గాను, రైతు భరోసా రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్, సిలివేరి సత్యనారాయణ, జేకే శ్రీను, తోట లలిత శారద, సుజాత, పరుచూరి వెంకటేశ్వర్లు, కంభంపాటి రేణుక, దేవీలాల్, బావుసింగ్, నబి, చాందు, గిన్నారపు రాజేశ్, కాసాని హరిప్రసాద్, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, సరిత పాల్గొన్నారు.