– పాల్గొన్న 8 కోల్ మైన్స్ కంపెనీ క్రీడాకారులు
– క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని మంచి ఫలితాలు సాధించాలి
– సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎల్.వి సూర్యనారాయణ
రామవరం, నవంబర్ 28 : క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలుపుతో పొంగిపోకుండా, ఓటమితో కుంగిపోకుండా పోటీతత్వం అలవర్చుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎల్.వి సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలను ఏరియా పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలు కార్మికుల్లో క్రీడాస్ఫూర్తి, జట్టు సహకారం, ఆరోగ్య పరిరక్షణ వంటి విలువలను పెంపొందిస్తాయన్నారు. సింగరేణి సంస్థ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ క్రీడా పోటీలకు విశిష్ట అతిథులుగా డైరెక్టర్ పి పి కే వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఈ అండ్ ఎం తిరుమలరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సింగరేణి ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా నిలబెట్టే విధంగా క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. యువతలో కబడ్డీ వంటి స్వదేశీ ఆటలకు మంచి గుర్తింపు రావడానికి సింగరేణి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు, వెల్ఫేర్ జీఎం కిరణ్ కుమార్, ఎస్ ఓ టు జి ఎం జీవి కోటిరెడ్డి, సి ఎం ఓ ఏ ఐ అధ్యక్షుడు నరసింహారావు, ఉపేందర్, యూనియన్ నాయకులు, ఏఐటియుసి నాయకులు రాజ్ కుమార్, వట్టి కొండ మల్లికార్జునరావు, ఐ ఎన్ టి యు సి త్యాగరాజు, రజాక్, టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ఆంజనేయులు, సిఐటియు విజయగిరి శ్రీనివాస్, ఆసిఫ్, అధికారులతో పాటు క్రీడాభిమానులు భారీగా పాల్గొన్నారు.

Ramavaram : సింగరేణి ఆధ్వర్యంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం