మట్టి గణనాథులను ప్రతిష్ఠించాలి
- మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- నగరంలో ఆసరా పింఛన్, గుర్తింపుకార్డుల పంపిణీ
ఖమ్మం, ఆగస్టు 30 : వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలన్నీ తొలగించి అన్ని శుభాలు కలగాలని ఆకాంక్షించారు. తనపై ఉన్న అభిమానంతో మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన పలువురికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మట్టి వినాయకుడిని పూజించాలని కోరుతూ కోర్టు కాంప్లెక్స్ నందు లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎకో ప్రెండ్లీ మట్టి గణేష్ విగ్రహాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పంపిణీ చేశారు.
ఆర్ అండ్‌బీ గెస్ట్ హౌజ్ వద్ద బొమ్మగ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను మంత్రి పంపిణీ చేశారు. ఖమ్మం పెవిలియన గ్రౌండ్ వద్ద సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఏర్పాలు చేసిన విగ్రహాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం షాదీఖానాలో ఆసరా పింఛన్ కార్డులు, గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెవిలియన్ గ్రౌండ్లో 43, 44, 45, 49 డివిజన్ల లబ్దిదారులకు, నయాబజార్ కళాశాల గ్రౌండ్లో 35,46,47,48, డివిజన్ల లబ్ధిదారులకు ఆసరా, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, విజయనిర్మల, ప్రసాద్, ఎస్కే హాల్య, షౌకత్‌అలీ, అమృతమ్మ, కర్నాటి కృష్ణ, పసుమర్తి రాంమ్మోహన్రావు, తోట గోవిందమ్మ, మాటేటి అరుణ, వెంకట్రావు, క్లెయిమెంట్, పాలెపు విజయ, బుగిడెం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

