భద్రచలం : ఖమ్మం జిల్లా భద్రచలంలోని కూనవరం ఆర్టీఏ చెక్ (Kunavaram Checkpost) పోస్టు వద్ద ఎక్సైజ్ అధికారులు రూ. 37.60 లక్షల విలువగల గంజాయిని (Ganja seize) పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 130.730 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒరిస్సా నుంచి కర్ణాటకకు కారులో గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ (Excise Enforcement Police) పోలీసులు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ముంబాయికి చెందిన యూసఫ్ సహీద్ ఖాన్ అనే గంజాయి స్మగ్లర్ , జహీరాబాద్‌కు చెందిన డ్రైవర్ మహ్మద్ షరీఫ్ తో పాత పరిచయాలున్నాయి.
డ్రైవర్‌గా ఒక్క రోజు విధులు నిర్వహిస్తే రూ. 50 వేలు వస్తాయని యూసఫ్ డ్రైవర్ మహ్మద్ షరీఫ్‌ను నమ్మించాడు. రూ. 2.20 లక్షల నగదు ఒడిస్సాలోని మల్కాన్‌గిరి ప్రాంతానికి వెళ్లి నగదు ఇస్తే వారు ఇచ్చే గంజాయిని తీసుకురావాలని పురామయించి నగదును అందజేశాడు. అక్కడి నుంచి వారిచ్చె గంజాయిని కారులో తీసుకువచ్చి కర్ణాటకలోని హుమ్నాబాద్ లో అప్పగించాలని మాట్లాడుకున్నారు. షరీఫ్ మల్కాన్గిరికి వెళ్లి 130.730 కిలోల గంజాయిని తీసుకొని తిరుగు ప్రయాణమయ్యడు.
ఈ సమాచారాన్ని అందుకున్న ఏఈఎస్ తిరుపతి, ఎస్టీఎఫ్ సీఐ సిహెచ్ శ్రీనివాస్ బృందం కలిసి భద్రాచలం కూనవరం ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మాటు వేసి ముంబాయి వెళుతున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో ముంబాయికి చెందిన యూసఫ్ సహీద్ ఖాన్, డ్రైవర్ మహ్మమద్ షరీఫ్‌పై కేసు నమోదు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు.